సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, మల్కాజ్‌గిరి నుంచి సునీత... కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
- 57 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
- తెలంగాణ నుంచి ఐదుగురు అభ్యర్థుల ప్రకటన
- పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి పోటీ
- పెండింగ్‌లో 8 నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన
పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో నలుగురిని ఖరారు చేసింది. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్ షేట్కార్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. మెదక్, ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్... ఈ ఎనిమిది లోక్ సభ స్థానాలపై సస్పెన్స్ కొనసాగుతోంది.