Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవని గౌరవించక్కర్లేదు: నాగబాబు

No need to respect every idiot by his age says Nagababu
Advertisement
  • వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారన్న నాగబాబు
  • ఎవరినీ ఉద్దేశించి చెప్పలేదని వ్యాఖ్య
  • తాను చెప్పింది జీవిత సత్యమన్న నాగబాబు
Advertisement
సినీ నటుడు, జనసేన నేత నాగబాబు చేసే ట్వీట్లు ఒక్కోసారి చాలా వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. 'వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు' అంటూ కన్ఫ్యూషియస్ కోట్ ను షేర్ చేశారు. గమనిక అంటూ దీనికి వివరణ కూడా ఇచ్చారు. ఏం మాట్లాడినా మా గురించేనేమో అని ఆపాదించుకుంటున్నారని... ఇది ఎన్నికల సమయం కాబట్టి తన ఉద్దేశాలను చెపుతున్నానే కానీ... ఎవరినీ ఉద్దేశించి చెప్పింది కాదు అని తెలిపారు. తాను చెప్పింది జీవిత సత్యమని అన్నారు. 

Advertisement
Advertisement
Nagababu
Janasena
AP Politics

More Telugu News