తొలి దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ సెన్సేషనల్ రికార్డు!
- బన్నీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 25 మిలియన్ల ఫాలోవర్లు
- ఐకాన్ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, దుల్కర్ సల్మాన్, యశ్
- ప్రిన్స్ మహేశ్ బాబుకు ఇన్‌స్టాలో 13.4 మిలియన్ల మంది ఫాలోవర్లు
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప-2' మూవీలో నటిస్తున్నాడు. 'పుష్ప: ది రైజ్' కు సీక్వెల్‌గా ఈ చిత్రం వస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలోకి రానుంది. 'పుష్ప-2' తర్వాత ఐకాన్ స్టార్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేయనున్నాడని సమాచారం. కాగా, పుష్ప సినిమాలోని నటనకు గాను బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.