ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్

Allu Arjun at Khairatabad rto offic
  • అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చిన అల్లు అర్జున్
  • మధ్యాహ్నం ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన స్టైలిష్ స్టార్
  • అల్లు అర్జున్‌ను చూసేందుకు పలువురి ఆసక్తి
టాలీవుడ్ నటుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆయన ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు. త్వరలో జపాన్‌లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ జరగనుందనే ప్రచారం జరుగుతోంది. అక్కడ డ్రైవింగ్ అవసరమై ఈ లైసెన్స్ తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. అల్లు అర్జున్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన సమయంలో ఆయనను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపారు. సిబ్బంది ఆయనతో సెల్ఫీలు దిగారు. అల్లు అర్జున్ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చారని, అలాగే తన రేంజ్ రోవర్ కారును టీజీ 09 0666 నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆర్టీవో అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Allu Arjun
Hyderabad
driving

More Telugu News