జగిత్యాల సభలో ప్రధాని మోదీ 'శక్తి' వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు
- రాహుల్ గాంధీ 'శక్తి' వ్యాఖ్యల్ని ప్రధాని నరేంద్రమోదీ వక్రీకరించారని ఫిర్యాదు
- ప్రధాని మోదీ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయన్న కాంగ్రెస్ నేతలు
- రాహుల్ గాంధీపై ఉద్దేశ్యపూర్వకంగా అబద్దపు ప్రచారం చేశారన్న భట్టివిక్రమార్క
ఈ మేరకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ... రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని వక్రీకరించారని ఆరోపించారు. రాహుల్ గాంధీపై ఉద్దేశ్యపూర్వకంగా అబద్దపు ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రధాని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు.