బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఈడీ
- కవితని శనివారం కోర్టులో హాజరుపరచడానికి ముందు వైద్య పరీక్షలు నిర్వహించిన ఈడీ
- కస్టడీకి తీసుకున్న తర్వాత ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న ఈడీ అధికారులు
- కవిత పిటిషన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి
కవిత పిటిషన్‌కు కోర్టు అనుమతి
తన కొడుకు, తల్లిని చూసేందుకు అనుమతివ్వాలని రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కవితకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఎనిమిది మంది కలవడానికి కోర్టు అనుమతించింది. వారిలో తల్లి శోభ, పిల్లలు, కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతించింది.