BRS: బీఆర్ఎస్‌కు మహారాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజీనామా... ఎన్సీపీలో చేరిక

Maharashtra BRS leader Manikrao Kadam joins Ajit Pawar led NCP
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు ముఖ్య నేతలు ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలోనూ ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి మాణిక్ రావ్ కదం రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ఆయనకు ఎన్సీపీ రైతు సంఘం అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది.

మాణిక్ రావు కదంతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఎన్సీపీలో చేరారు. ఈ మేరకు వారు బీఆర్ఎస్ అధినాయకత్వానికి లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నెలల తరబడి అధినాయకత్వం మౌనం, కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి దిశా నిర్దేశం లేకపోవడంతో తాము తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Go Back to Shorts
BRS
ncp
ajit pawar
KCR

More Telugu News