‘రజాకార్’ మూవీపై యాంక‌ర్‌ సుమ ఎమోష‌న‌ల్ ట్వీట్‌..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘రజాకార్’ మూవీపై యాంక‌ర్‌ సుమ ఎమోష‌న‌ల్ ట్వీట్‌..!

Anchor Suma Kanakala Emotional Tweet on Razakar Movie
  • పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ‘రజాకార్’ మూవీ
  • యథార్థ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు యాటా సత్యనారాయణ
  • కీల‌క పాత్ర‌ల్లో బాబీసింహా, అనసూయ, ఇంద్రజ, ప్రేమ‌
  • ఈ మూవీ చూసిన ప్రేక్షకులు అప్ప‌ట్లో ఇంతటి దారుణాలు జరిగాయా? అంటూ చలించిపోతున్న వైనం
  • సినిమా చూసి గుండె ప‌గిలిపోయేలా ఉందంటూ సుమ ట్వీట్‌  
ఈ నెల 15వ తేదీన‌ విడుద‌లైన ‘రజాకార్’ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు యాటా సత్యనారాయణ యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు. గూడూరు నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో బాబీసింహా, అనసూయ, రాజ్ అర్జున్, మార్కండ్ దేశ్‌పాండే, ఇంద్రజ, తేజ్ సప్రు, ప్రేమ‌, తలైవాస్ విజయ్ కీల‌క‌ పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ చూసిన ప్రేక్షకులు ఇంతటి దారుణాలు జరిగాయా? అని తమ చరిత్రను తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకుని చలించిపోతున్నారు.

తాజాగా ‘రజాకార్’ సినిమా చూసిన యాంక‌ర్ సుమ క‌న‌కాల కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. ఈ సంద‌ర్భంగా ఆమె చేసిన ఎమోష‌న‌ల్ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. "కొద్దిసేప‌టి క్రిత‌మే ‘రజాకార్’ మూవీ చూశాను. ఆ సంఘ‌ట‌న‌లు, హైద‌రాబాద్ సంస్థానం స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాన్ని చూసి గుండె ప‌గిలిపోయేలా ఉంది. ఇందులో ఈ సంఘ‌ట‌న‌లు కళ్లకు క‌ట్టిన‌ట్లుగా చూపించినందుకు ద‌ర్శ‌కుడికి ధ‌న్య‌వాదాలు. అన‌సూయ‌, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, బాబీ సింహా ఇలా న‌టులంద‌రూ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. చాలా బాగా న‌టించారు సింప్లీ సూప‌ర్బ్" అని త‌న ట్వీట్‌లో పేర్కొంది. ప్ర‌స్తుతం సుమ ట్వీట్ వైర‌ల్ అవుతుండ‌గా, దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.
Advertisement
Suma Kanakala
Razakar Movie
Twitter
Tollywood

More Telugu News