టీఎస్ఆర్‌టీసీ బ‌స్సుల స‌మాచారం తెలిపే 'గ‌మ్యం' యాప్‌

16-03-2024 Sat 09:56 | Telangana
Advertisement
  • ప్ర‌స్తుతం ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న యాప్‌
  • మొద‌ట దూర‌ప్రాంతాల‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్, సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ బ‌స్సుల‌కు గ‌మ్యం యాప్ అనుసంధానం
  • ఈ ఏడాది మొత్తం 1,100 కొత్త బ‌స్సులు తీసుకువ‌స్తున్న టీఎస్ఆర్‌టీసీ 
  • అన్నింటిలోనూ అందుబాటులో గ‌మ్యం యాప్  
Advertisement
మ‌నం ప్ర‌యాణించాల్సిన బ‌స్సు స‌మాచారం తెలిపే గ‌మ్యం యాప్‌ను టీఎస్ఆర్‌టీసీ ఏడాది క్రితం అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. కానీ, ఈ యాప్ కేవ‌లం ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. మిగ‌తా వాటిలో దీని జాడ లేదు. మొద‌ట దూర‌ప్రాంతాల‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్, సూప‌ర్ ల‌గ్జ‌ర, ఏసీ బ‌స్సుల‌కు గ‌మ్యం యాప్ ను అనుసంధానించారు. ఆ త‌ర్వాత న‌గ‌రంలో తిరిగే అన్ని బ‌స్సుల‌కు అమ‌ర్చాల‌ని ప్ర‌య‌త్నించారు. 

ఇక కొత్త బ‌స్సులు స‌మ‌కూరితే వాటిలో వెహిక‌ల్ ట్రాకింగ్ సిస్ట‌మ్ (వీటీఎస్‌) అర్చాల‌ని నిర్ణ‌యించారు. మొత్తం 500 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు ఆగ‌స్టు నాటికి రానున్నాయి. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వీటిని తీసుకువ‌స్తున్న‌ట్లు టీఎస్ఆర్‌టీసీ అధికారులు చెబుతున్నారు. దీనిలో భాగంగా మంగ‌ళ‌వారం ప్రారంభించిన‌ 22 బ‌స్సుల్లో గ‌మ్యం యాప్‌ను అనుసంధానం చేశారు. 

ఓవైపు అద్దెకు ఎల‌క్ట్రిక్ బ‌స్సులు తీసుకుంటుండగానే టీఎస్ఆర్‌టీసీ సొంతంగా 565 డీజిల్ బ‌స్సులు స‌మ‌కూర్చుకుంటోంది. ఈ సంవ‌త్స‌రం మొత్తం 1,100 కొత్త బ‌స్సులు రానున్నాయి. వీటి అన్నింటిలోనూ గ‌మ్యం యాప్ అందుబాటులో ఉంటుంది. ఇలా బ‌స్సుల‌కు ఈ యాప్‌ను అనుసంధానం చేసి ప్ర‌యాణికుల‌కు బ‌స్సుల జాడ తెలిసేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని టీఎస్ఆర్‌టీసీ అధికారులు చెప్పుకొచ్చారు.
Advertisement
TSRTCGamyam AppBus servicesTelangana

More Telugu News

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08
..more