ఆదిలాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం... లోక్ సభ అభ్యర్థి ఎంపికపై చర్చ
- లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై కేసీఆర్ దిశా నిర్దేశనం
- ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును లోక్ సభకు పరిశీలిస్తున్న కేసీఆర్
- గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్రం సక్కుకు టిక్కెట్ ఇవ్వని కేసీఆర్
- లోక్ సభ టిక్కెట్ కేటాయిస్తామని అధిష్ఠానం హామీ
గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నగేష్ ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. లోక్ సభ టిక్కెట్ కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తనకు టిక్కెట్ రాదనే నగేశ్ పార్టీ వీడి బీజేపీలో చేరినట్లుగా తెలుస్తోంది.