34 మందితో రెండో జాబితా విడుదల చేసిన తెలుగుదేశం

14-03-2024 Thu 13:51 | Andhra
Advertisement
  • ఇటీవలే 94 మందితో తొలి జాబితా ప్రకటించిన టీడీపీ
  • నేడు రెండో జాబితా ప్రకటించిన చంద్రబాబు
  • రాజమండ్రి రూరల్ నుంచే గోరంట్ల బుచ్చయ్య
  • వైసీపీ కంచుకోట కందుకూరు బరిలో ఇంటూరి నాగేశ్వరరావు
  • పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా పల్లా రామచంద్రారెడ్డికి చాన్స్
Advertisement
తెలుగుదేశం పార్టీ 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. రాజమండ్రి రూరల్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దక్కించుకోగా, గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాకలో ఈసారి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు టికెట్ దక్కించుకున్నారు. దెందులూరు నుంచి మరోసారి చింతమనేని ప్రభాకర్ కే అవకాశం ఇచ్చారు. 

గురజాల నుంచి యరపతినేని శ్రీనివాసరావు బరిలో దిగుతుండగా, వైసీపీ నుంచి టీడీపీ వైపునకు మరలిన ఆనం రామనారాయణరెడ్డిని ఆత్మకూరు అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు.

ఇక, ప్రకాశం జిల్లాలో గత కొంతకాలంగా కాంగ్రెస్ కు, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారిన కందుకూరు నియోజకవర్గం నుంచి ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. 

మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా చల్లా రామచంద్రారెడ్డి (బాబు) టికెట్ దక్కించుకున్నారు. అంతేకాదు, వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు అదే స్థానం నుంచి టీడీపీ టికెట్ కేటాయించింది.

రెండో జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించగా, అందులో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు. అందులో పదో తరగతి, అంతకంటే తక్కువ చదివినవాళ్లు ఐదుగురు ఉన్నారు. ఒకరు పీహెచ్ డీ, 11 మంది పీజీ, 9 మంది గ్రాడ్యుయేషన్, 8 మంది ఇంటర్ చదివిన వారు ఉన్నారు. 

ఇక, వయసు చూస్తే... 61 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారు ముగ్గురు ఉండగా... అత్యధికంగా 46 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు 19 మంది ఉన్నారు. 

తొలి జాబితాలో టీడీపీ 94 మంది పేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండో జాబితాతో కూడా కలిపి ఇప్పటివరకు 128 మందిని ప్రకటించినట్టయింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు... బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు 6 ఎంపీ స్థానాలు కేటాయించారు. 
Advertisement
TDPSecond ListAssemblyAndhra Pradesh

More Telugu News

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51
..more