K Kavitha: ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు... తండ్రి ఆశీర్వాదం తీసుకున్న కూతురు

Kavitha takes blessings of KCR
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన పుట్టిన రోజు వేడుక సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్‌ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత... తన తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. సోషల్ మీడియాలో కవితకు నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.
Go Back to Shorts
K Kavitha
BRS

More Telugu News