రేపు కాంగ్రెస్ లో చేరనున్న కోనేరు కోనప్ప
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవికి కోనప్ప రాజీనామా
- మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న మాజీ ఎమ్మెల్యే
- బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు నేపథ్యమే కారణమంటున్న అనుచరులు
తాజాగా జిల్లా అధ్యక్ష పదవికి కోనప్ప రాజీనామా చేసి పార్టీ మారడం కన్ఫార్మ్ అని కోనప్ప స్పష్టం చేశారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును జీర్ణించుకోలేకే కోనప్ప పార్టీని వీడుతున్నారని సమాచారం. కోనప్పతో పాటు జిల్లాలోని ద్వితీయశ్రేణి నేతలు ఎంతమంది బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనున్నారనేది సస్పెన్స్ గా మారింది. లోక్ సభ ఎన్నికల వేళ ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బలమైన నాయకుడు కోనప్ప పార్టీని వీడడం బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.