సీఎం సలహాదారును కలిసిన విషయంపై కేటీఆర్‌కు మల్లారెడ్డి వివరణ
- తనయుడు భద్రారెడ్డితో కలిసి కేటీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి
- అల్లుడి భవనాల కూల్చివేతకు సంబంధించి కలిసినట్లు కేటీఆర్‌కు వివరణ
- తాను పార్టీ మారడం లేదని స్పష్టీకరణ
తన అల్లుడు రాజశేఖరరెడ్డి కాలేజీకి చెందిన భవనాల కూల్చివేతకు సంబంధించి వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు కేటీఆర్‌కు తెలిపారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కాగా, గతంలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తన తనయుడు మల్కాజిగిరి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని చెప్పారు. అయితే ఈ రోజు తాను పోటీ చేయడం లేదని భద్రారెడ్డి పార్టీ అగ్రనేతకు స్పష్టం చేశారు.