కాళేశ్వరం విషయంలో బద్నాం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృత్రిమ కరవును సృష్టించింది: కవిత
- రేవంత్ రెడ్డి బీజేపీతో కలుస్తారని జోస్యం
- కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు... ప్రజావ్యతిరేక పాలన అని విమర్శ
- జీవో 3 రద్దు కోసం అనుమతివ్వకపోయినా ధర్నా చేస్తామని స్పష్టీకరణ
కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని... ప్రజావ్యతిరేక పాలన అని మండిపడ్డారు. జీవో 3 ద్వారా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను రద్దు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తమకు అనుమతి ఇవ్వకపోయినా జీవో 3 రద్దు కోసం ధర్నా చేసి తీరుతామని తేల్చి చెప్పారు.