నూతన ఆవిష్కరణ.. బెలూన్లోకి గాలి ఊదడం ద్వారా డయాబెటిస్ టెస్ట్!
- వైద్య చరిత్రలో మరో సంచలనం
- బెలూన్ లాంటి పరికరాన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు
- రూ. 16 వేలకే అందుబాటులోకి
- మరిన్ని మార్పులతో త్వరలోనే మార్కెట్లోకి
ఈ పరికరంతో ఇప్పటి వరకు పలు పరీక్షలు నిర్వహించగా మెరుగైన ఫలితాలు వచ్చినట్టు సీనియర్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రీతు తెలిపారు. ఈ నాన్ ఇన్వాజివ్ గ్లూకోమీటర్లో 10 మల్టీ సెన్సార్లను అమర్చినట్టు పేర్కొన్నారు. రూ. 16 వేలకే దీనిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. డయాబెటిస్ పరీక్షలకే కాకుండా గుండెపోటు లాంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించే సెన్సార్లను కూడా ఇందులో అమర్చబోతున్నట్టు వివరించారు. ప్రస్తుతం ఈ పరికరం పరిమాణం పెద్దగా ఉందని, దీనిని తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పారు.