Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పేదలకు ఇళ్లు కట్టించిన ప్రధాని మోదీకి సొంతిల్లే లేదు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman says pm modi have no home
Advertisement
  • దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులన్న బీజేపీ నేత
  • అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మోదీదే అని వ్యాఖ్య
  • మాజీ సీఎం కేసీఆర్.. కొడుకునో, కూతురునో సీఎంగా చేయడానికి పని చేస్తున్నారని విమర్శ
Advertisement
దేశంలో పేదలకు కోట్లాది ఇళ్లు కట్టించిన ప్రధాని నరేంద్ర మోదీకి సొంతిల్లే లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశ ప్రజలే మోదీ కుటుంబ సభ్యులన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మోదీదే అన్నారు. మాజీ సీఎం కేసీఆర్.. కొడుకునో, కూతురునో సీఎంగా చేయడానికి పని చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2500 ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. రూ.500కే సిలిండర్ ఇస్తామని చెప్పి... ఇప్పుడు కొర్రీలు పెడుతున్నారన్నారు.

200 యూనిట్ల విద్యుత్ బిల్లు ఉచితంపై మాట తప్పారన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా రైతు భరోసా కింద రూ.15వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ హామీలు ఉంటాయనే నమ్మకం లేదన్నారు. రైతు భరోసా డిసెంబర్‌లోనే ఇవ్వాల్సిందని... కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో కలిసే పని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. గడీలు బద్దలు కొట్టాలని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు అదే గడీల్లో తల దాచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 12న తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా వస్తున్నారని... పోలింగ్ బూత్‌స్థాయి నేతల సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.
Advertisement
Advertisement
BJP
BRS
Congress
laxman

More Telugu News