ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్... వరంగల్ లోక్ సభకు పోటీ

BabuMohan to Contest from Praja Shanti Party
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్
  • రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేస్తారని ప్రకటన
  • ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన బాబు మోహన్
ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సమక్షంలో సోమవారం ఆయన ఆ పార్టీ కండువాను కప్పుకున్నారు. ఆయనను పాల్ తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేఏ పాల్ ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన బాబు మోహన్... చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 2014లో టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఆందోల్ నుంచి విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ రోజు ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు.
Go Back to Shorts
babu mohan
KA Paul
Lok Sabha Polls
Warangal

More Telugu News