Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ డ్యాన్స్ ప్రదర్శన.. మైమరచిపోయిన ఆహూతులు.. వీడియో ఇదిగో!

Nita Ambani Stunning Performance In Son Anant Ambani Pre Wedding Celebrations
Advertisement
  • జామ్‌నగర్‌లో వైభవంగా అనంత్ అంబానీ-రాధిక ముందస్తు పెళ్లి వేడుకలు
  • ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రముఖులు
  • ‘విశ్వంభర స్తుతి’కి సంప్రదాయ ప్రదర్శన ఇచ్చిన నీతా అంబానీ
  • తన ప్రదర్శనను మనవరాళ్లు, యువతులకు అంకితమిచ్చిన నీతా
Advertisement
బిలియనీర్ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ముందస్తు పెళ్లి వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాప్ సింగర్ రిహన్నా సహా ఎంతోమంది తమ ప్రదర్శనలతో ఆహూతులను ఉర్రూతలూగించారు. 

నిన్న జరిగిన వేడుకల్లో నీతా అంబానీ ఇచ్చిన సంప్రదాయ నృత్య ప్రదర్శన చూసి ఆహూతులు మైమరచిపోయారు. ‘విశ్వంభర స్తుతి’కి ఆమె ఇచ్చిన ప్రదర్శన ‘ఔరా’ అనిపించింది. విశ్వంభర శృతి అనేది దుర్గాదేవిని స్తుతిస్తూ ఆలపించే పాట. నీతా తన ప్రదర్శనను తన మనవరాళ్లు ఆదియా శక్తి, వేద సహా మహిళా శక్తి స్వరూపాలైన యువతులకు అంకితమిచ్చారు.
Advertisement
Advertisement
Anant Ambani
Radhika Merchant
Mukesh Ambani
Nita Amabani
Vishwambhari Stuti

More Telugu News