కేసీఆర్ ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు... రేవంత్ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నాం: కిషన్ రెడ్డి
- బీఆర్ఎస్ హయాంలో ప్రధాని వచ్చినప్పుడు స్వాగతం పలికే సంప్రదాయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని విమర్శ
- ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానాలు పంపిస్తామన్న కిషన్ రెడ్డి
- మేడిగడ్డకు అందరికంటే ముందు వెళ్లింది బీజేపీయే అన్న కేంద్రమంత్రి
రాష్ట్రానికి ప్రధాని వచ్చిన సందర్భంలో గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయమని చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టిందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ అంశంపై మాట్లాడుతూ... అందరికంటే ముందుగా తామే అక్కడకు వెళ్లామని గుర్తు చేశారు. మేడిగడ్డపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక సరైనదే అన్నారు.