Daggubati Purandeswari: పవన్ ఎవరితో తిట్లు తిన్నారో ఆయనే చెప్పాలి: పురందేశ్వరి

Purandeswari talks about Pawan Kalyan statements
షార్ట్స్‌లో చూడండి
అమరావతిలో మార్చి 2, 3 తేదీల్లో బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ సహ సంఘటన్ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరు కానున్నారు. ఈ సమావేశాలకు రావాల్సిందిగా బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ నేతలకు, జిల్లా ముఖ్య నేతలకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈ సమావేశాల్లో పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో ఏపీలో బీజేపీ పొత్తులపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిని మీడియా పలకరించింది. పొత్తులకు సంబంధించి పవన్ కల్యాణ్ అధిష్ఠానం అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారు... ఆయన పదేపదే అధిష్ఠానం అని అంటున్నారు? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఈ ప్రశ్న పవన్ కల్యాణ్ నే అడగాలని పురందేశ్వరి బదులిచ్చారు. అధిష్ఠానం అని చెప్పింది... అలాంటప్పుడు నన్ను ఎలా అడుగుతారు? అని తిరిగి ప్రశ్నించారు.

'పై నుంచి తిట్లు తింటున్నాను' అని కూడా పవన్ కల్యాణ్ చెబుతున్నారు... దీనిపై మీరేమంటారు? అని ఆ మీడియా ప్రతినిధి మరోసారి పురందేశ్వరిని అడిగారు. అందుకు పురందేశ్వరి స్పందిస్తూ... 'దానికి కూడా వివరణ ఆయనే ఇవ్వాలి... నేను కాదు' అని స్పష్టం చేశారు. 

ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతుందా?... బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... పొత్తులను తమ అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుందని పురందేశ్వరి పునరుద్ఘాటించారు.
Go Back to Shorts
Daggubati Purandeswari
Pawan Kalyan
BJP
Janasena
Andhra Pradesh

More Telugu News