సాగు’ వంటి మంచి కాన్సెప్ట్ సినిమాలను అందరూ ప్రోత్సహించాలి: నిహారిక కొణిదెల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాగు’ వంటి మంచి కాన్సెప్ట్ సినిమాలను అందరూ ప్రోత్సహించాలి: నిహారిక కొణిదెల

Niharika Konidela appeals everyone encourage concept movies like Saagu
  • వంశీ తుమ్మల, హారిక బల్ల జంటగా సాగు
  • వినయ్ రత్నం దర్శకత్వంలో చిత్రం
  • సినిమా నచ్చడంతో సమర్పకురాలిగా ఎంటరైన నిహారిక
  • మార్చి 4 నుంచి వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్
వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'సాగు'. వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డాక్టర్ యశస్వి వంగా నిర్మించారు. 'సాగు' సినిమా కాన్సెప్ట్ నచ్చి మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని సమర్పించారు. ప్రేమ... వివక్షతో నిండిపోయిన సమాజాన్ని ఎదురిస్తుంది, ఓడిస్తుంది... ప్రేమ ఎటువంటి క్లిష్టమైన సవాలునైనా ఎదుర్కొంటుంది అనే అంశాలే ఇతివృత్తంగా, వ్యవసాయం నేపథ్యంలో 'సాగు' చిత్రం తెరకెక్కించారు. 

కాగా, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ,  టాటా స్కై బింగ్, ఎయిర్ టెల్ ఎక్స్‌ట్రీమ్, ఎం.ఎక్స్ ప్లేయర్స్, హంగామా, జెసాన్, వ్యూయిడ్, యాక్ట్, నెట్ ప్లస్ బ్రాండ్, వి.ఐ,  ఫైర్ టీవీ స్టిక్, ఎం.ఐ, ఎల్.జి, 1+ టీవీ, క్లౌడ్ వాకర్, వాచో మాధ్యమాల్లో మార్చి 4 నుంచి ‘సాగు’ స్ట్రీమింగ్ కానుంది. 

ఈ నేపథ్యంలో గురువారం నాడు సాగు సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం ఈ చిత్ర సమర్పకురాలు నిహారిక కొణిదెల మాట్లాడుతూ... "సాగు అనే మూవీ నాకు ఎంతో ప్రత్యేకమైనది. లైఫ్‌లో మనకు చాలా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ హోప్ అనేది వదలకుండా ముందుకు వెళ్లాలని అనుకుంటాం. వ్యవసాయదారులకు ఎంతో హోప్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. నా జీవితంలో నాకు ప్రతీ విషయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తోడున్నారు. 

52 నిమిషాలున్న ఈ షార్ట్ ఫిల్మ్‌ని 4 రోజుల్లో చిత్రీకరించారు. ఇలాంటి యంగ్ టీంను సపోర్ట్ చేయడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. ఇంత మంచి ప్రాజెక్ట్ నా వద్దకు తీసుకొచ్చిన అంకిత్‌కు థాంక్స్. ఇలాంటి సబ్జెక్ట్ తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టాల్ని నేను ఎప్పుడూ దగ్గరుండి చూడలేదు. కానీ ఇలాంటి సినిమాను అందరి ముందుకు తీసుకు రావడం ఆనందంగా ఉంది. సాగు సినిమాను నేను సమర్పిస్తున్నాను. ఇలాంటి మంచి ప్రాజెక్టులను నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌లను సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ఆదరించి ప్రోత్సహించాలి" అని అన్నారు. 

డైరెక్టర్ వినయ్ రత్నం మాట్లాడుతూ... "మా సినిమాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్. మా చిత్రాన్ని చూసి మాకు సపోర్ట్ చేసిన నిహారిక గారికి థాంక్స్. రైతు గురించి చెప్పాలని సాగు తీశాను. ఓ మనిషిని కులం, డబ్బు, సమాజం వంటివి ఆపుతుంటాయి. సమస్య ఎలాంటిది అయినా కూడా ఆత్మహత్య పరిష్కారం కాదు అనే సందేశాన్ని ఇవ్వాలని తీశాను" అని వివరించారు.
Advertisement
Saagu
Concept Movie
Niharika Konidela
Vinay Rathnam
Tollywood
OTT

More Telugu News