బండ్ల గణేశ్ వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా
- బండ్ల గణేశ్ ఎవరు? అని మీడియాను ప్రశ్నించిన రోజా
- సెవన్ ఓ క్లాక్ బ్లేడ్‌తో గొంతు కోసుకొని చచ్చిపోతానన్నాడు... ఆయనేనా? అని ఎద్దేవా
- అలాంటి వాళ్ల గురించి ఏం చెబుతామని వ్యాఖ్య
ఈ క్రమంలో రోజాను గురువారం మీడియా ప్రతినిధులు బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై స్పందన అడిగారు. దీంతో రోజా పైవిధంగా స్పందించారు. 'ఎవరతను.. ఎవరో సెవన్ ఓ క్లాక్ బ్లేడ్‌తో కోసుకొని చచ్చిపోతానన్నాడు ఆయనేనా... ఏం చెబుతాం వాళ్ల గురించి..' అని నవ్వుతూ సమాధానం చెప్పారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ... ఈ రోజుల్లో ఓ మహిళ సక్సెస్ఫుల్ స్థానంలో ఉంటే, కష్టపడి పైకి వస్తే, తప్పులను ఎత్తి చూపితే నీచంగా మాట్లాడటం... వల్గర్‌గా మాట్లాడటం టీడీపీకి, జనసేనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అందుకే మహిళలు వారిని అసహ్యించుకున్నారని గుర్తించాలన్నారు.