అదంతా పుకారే .. అందులో నిజం లేదు: 'బిగ్ బాస్' అలీ రెజా
- బిగ్ బాస్ సీజన్ 3లో సందడి చేసిన అలీ రెజా
- తమ సీజన్ సమయంలో హైప్ బాగుండేదని వ్యాఖ్య
- తన ఎలిమినేషన్ బాధించిందని వెల్లడి
- రీ ఎంట్రీ అలా జరిగిందంటూ వివరణ
ఈ విషయంపై తాజాగా 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ రెజా మాట్లాడుతూ, "మా సీజన్ సమయంలో బిగ్ బాస్ పై హైప్ చాలా ఎక్కువగా ఉండేది. 50 రోజుల తరువాత నన్ను ఎలిమినేట్ చేశారు. ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. నాగ్ సార్ తో స్టేజ్ పై మాట్లాడుతుంటే కూడా కన్నీళ్లు వచ్చేశాయి. హౌస్ నుంచి బయటికి వచ్చిన తరువాత నాకు ఎంత ఫాలోయింగ్ ఉందనేది అర్థమైంది" అని అన్నాడు.
ఆ తరువాత మళ్లీ నన్ను 'బిగ్ బాస్'లోకి రమ్మని చెప్పి అడిగారు. నాకు ఇష్టం లేకపోయినా, అగ్రిమెంట్ ప్రకారం వెళ్లవలసి వచ్చింది. మా సీజన్ లో మేమంతా చిల్లర విషయాలను గురించి ఎప్పుడూ గొడవపడలేదు. గేమ్ గురించి మాత్రమే గొడవపడేవాళ్లం. నేను ఎదురు డబ్బిచ్చి మళ్లీ లోపలికి వెళ్లాననేది పుకారు మాత్రమే. బిగ్ బాస్ వలన నేను కోరుకున్న గుర్తింపు వచ్చింది. ఆ డబ్బుతో నేను ఇల్లు కొనుక్కున్నాను" అని చెప్పాడు.