అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగుదాం.. జనసేన అమలాపురం ఇన్ చార్జి
- అమలాపురం టికెట్ కేటాయింపు ప్రచారంపై సెట్టిబత్తుల రాజబాబు స్పందన
- అత్యుత్సాహం వద్దంటూ పార్టీ కార్యకర్తలకు హితవు
- నేడు జరగబోయే జనసేన, టీడీపీ సభను విజయవంతం చేయాలని పిలుపు
ఈమేరకు ట్విట్టర్ లో ఓ వీడియో సందేశం విడుదల చేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆఫీసు నుంచి అధికారికంగా ప్రకటన విడుదలయ్యాక సంబరాలు చేసుకుందామని చెప్పారు. ముందే సంబరాలు చేసుకుంటూ అత్యుత్సాహం ప్రదర్శించవద్దని జనసైనికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. బుధవారం తాడేపల్లిగూడెంలో జరగబోయే టీడీపీ- జనసేన సభను విజయవంతం చేయడంపైనే జనసైనికులంతా దృష్టి పెట్టాలని రాజబాబు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే తెలుగు జన విజయకేతన సభకు తరలిరావాలంటూ జనసేన కార్యకర్తలు, నేతలు, టీడీపీ శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు.