ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన నమీబియా బ్యాటర్ జాన్ నికోల్.. వెనుకబడ్డ రోహిత్ శర్మ
- కేవలం 33 బంతుల్లోనే సెంచరీ చేసిన జాన్ నికోల్
- టీ20 ఫార్మాట్‌లో వేగవంతమైన సెంచరీగా రికార్డు నమోదు
- నేపాల్‌పై చెలరేగి ఆడిన నమీబియా బ్యాట్స్‌మెన్
నెదర్లాండ్స్ కూడా ఆడుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. కీర్తిపూర్‌లోని త్రిభువన్ యూనివర్శిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో జాన్ సెంచరీతో నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేయగలిగింది. కాగా లక్ష్య ఛేదనలో నేపాల్ విఫలమైంది. 18.5 ఓవర్లలో 186 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ అయింది. దీంతో నమీబియా ఘనవిజయం సాధించింది.
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు...
1. జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ - 33 బంతులు(నేపాల్‌పై)
2. కుశాల్ మల్లా - 34 బంతులు (మంగోలియాపై)
3. డేవిడ్ మిల్లర్ - 35 బంతులు (బంగ్లాదేశ్‌పై)
4. రోహిత్ శర్మ - 35 బంతులు (శ్రీలంకపై)
5. సుధేష్ విక్రమశేఖర - 35 బంతులు (టర్కీపై).