జర్మనీ గాయని భక్తి గీతానికి దరువేసిన ప్రధాని మోదీ... వీడియో ఇదిగో!
- హైందవ భక్తిగీతాలతో అలరిస్తున్న జర్మనీ గాయని
- గతంలో ఆమె గురించి మన్ కీ బాత్ లోనూ ప్రస్తావించిన మోదీ
- తమిళనాడులోని పల్లడంలో మోదీని కలిసిన కసాండ్రా మే స్పిట్ మాన్
తమిళనాడులోని పల్లడం వద్ద కసాండ్రా మే స్పిట్ మాన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆమె 'అచ్యుతమ్ కేశవమ్' భక్తి గీతాన్ని ఆలపించగా... మోదీ తన చేతులతో దరువేస్తూ ఆమె పాటను ఆస్వాదించారు. అంతేకాదు, "వాహ్" అంటూ ఆమెను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జర్మనీ జాతీయురాలైన కసాండ్రా మే స్పిట్ మాన్ అనేక భారతీయ భాషల్లో భక్తి గీతాలు పాడుతూ గుర్తింపు పొందారు.