నా రాజకీయాల ముందు నువ్వొక బచ్చా!: చంద్రబాబు
- ఇంకొల్లులో రా కదలిరా సభ
- ఆవేశపూరితంగా ప్రసంగించిన చంద్రబాబు
- నీ పులివెందుల కూడా మేం గెలవబోతున్నాం అంటూ వ్యాఖ్యలు
- ఈ మీటింగ్ చూసి జగన్ ప్యాంట్ తడిసిపోయిందన్న చంద్రబాబు
"మేం మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డీ! ఈ మీటింగ్ చూసి జగన్ మోహన్ రెడ్డి ప్యాంట్ తడిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి సునామీ సృష్టించడం ఖాయం. గెలుపు మనదే... ఎవరికైనా అనుమానం ఉందా? అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతామే తప్ప నిలిచేదే లేదు. మీరు జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధం... వైసీపీని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధం!" అంటూ చంద్రబాబు ఆవేశపూరితంగా ప్రసంగించారు.