కూతురి కోసం రోడ్డు పక్క షాపులో క్యాండీ కొన్న కేజీఎఫ్ హీరో యశ్.. వైరల్ ఫొటో ఇదిగో

KGF sensation Yash Buys a candy for daughter in the road side shop
  • షాపు ముందు సాధారణ బెంచీపై కూర్చొన్న యశ్ భార్య రాధిక
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు
  • ఇటీవలే కుటుంబంతో కలిసి ప్రసిద్ధ చిత్రపూర్ మఠాన్ని సందర్శించిన కేజీఎఫ్ స్టార్
చిత్ర సీమలో ఎంత పెద్ద స్టార్లు అయినా నిజజీవితంలో బంధాలు, బంధుత్వాలకు ఎవరూ అతీతులు కాదు. బ్లాక్ బస్టర్లుగా నిలిచిన కేజీఎఫ్-1, 2 సినిమాల హీరో యశ్ ఈ విషయాన్ని నిరూపించాడు. తన కూతురి కోసం కారు దిగిన యశ్.. రోడ్డు పక్కన ఉన్న ఓ షాప్‌లో క్యాండీ కొని తన గారాల పట్టీకి అందిచ్చాడు. ఇటీవలే తన భార్య, ప్రముఖ నటి రాధిక పండిట్, కూతురు ఐరాతో కలిసి కర్ణాటకలోని భత్కల్ జిల్లా షిరాలీలో ఉన్న ప్రసిద్ధ చిత్రపూర్ మఠాన్ని యశ్ సందర్శించాడు. యశ్ క్యాండీ కొనుగోలు చేస్తుండగా అతడి భార్య రాధిక దుకాణం ముందు ఉన్న బెంచీపై కూర్చొని భర్త వైపు చూస్తూ ఈ ఫొటోలో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

మరోవైపు యశ్ తన కుటుంబంతో కలిసి చిత్రపూర్ మఠాన్ని సందర్శించేందుకు వచ్చాడని తెలిసి పరిసర ప్రాంతాల్లోని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. సెల్ఫీలు, ఫోటోల ఎగబడ్డారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఫ్యాన్స్‌ను నియంత్రించారు. 

కాగా స్టార్‌డమ్‌కు దూరంగా సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడని యశ్‌కు మంచి పేరుంది. పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడానికి ఇది కూడా ఒక కారణంగా ఉంది. యశ్ అతి సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చి స్టార్‌గా ఎదిగాడు. సీరియల్స్‌ యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టి సినీ పరిశ్రమలో సూపర్‌ స్టార్‌గా మారాడు. యశ్ తండ్రి బస్సు డ్రైవర్ అనే విషయం తెలిసిందే. కాగా యశ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘టాక్సిక్’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా అతడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Go Back to Shorts
KGF
Yash
Rocky Bhai
Toxic
Radhika Pandit
Ayra

More Telugu News