పెద్దలను ఒప్పించి నేపాల్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన పెనుమూరు అబ్బాయి
- లండన్లో ఉద్యోగం చేస్తున్న భువన్కృష్ణ
- అదే కంపెనీలో పనిచేస్తున్న మనీల
- నాలుగేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న జంట
- ఈ తెల్లవారుజామున చిత్తూరులో వివాహం
పెనుమూరుకు చెందిన భువన్కృష్ణ లండన్లో ఉద్యోగం చేస్తుండగా, నేపాల్ అమ్మాయి జి. మనీల కూడా అతడు చేస్తున్న కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరి మధ్య జరిగిన పరిచయం ప్రేమకు దారితీసింది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటి కావాలని భావించారు. విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. పెద్దలు సంతోషంగా వీరి ప్రేమను అంగీకరించారు. ఈ తెల్లవారుజామున చిత్తూరులోని ఓ హోటల్లో వీరి విహహం అంగరంగ వైభవంగా జరిగింది.