ఓటీటీ తెరపైకి మరో హారర్ థ్రిల్లర్!
- రితికా సింగ్ ప్రధాన పాత్రగా 'వళరి'
- హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమా
- స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న ఈటీవీ విన్
- మార్చి 6వ తేదీ నుంచి అందుబాటులోకి
'వళరి' అనేది తమిళనాడు ప్రాంతం వైపు ఉపయోగించే ఒక ఆయుధం పేరు. ఆంగ్లేయుల కాలంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించడాన్ని నిషేధించారు. ఈ ఆయుధంతో పాటు దెయ్యం నేపథ్యంతో కూడిన కథతో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈటీవీ విన్ వారు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు.
మార్చి 6వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, దివ్య పాత్రలో రితికా నటించింది. ఆమె జోడీగా కెప్టెన్ నవీన్ నాయుడు పాత్రలో శ్రీరామ్ కనిపించనున్నాడు. వైవిధ్య భరితమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.