బట్టతలకు చెక్ పెట్టే స్మార్ట్ డివైజ్.. ఆస్ట్రియా కంపెనీ తయారీ
- నెత్తికి హెల్మెట్‌లా పెట్టుకునే పరికరాన్ని విడుదల చేసిన నియోస్టెమ్
- తలపై రోజూ అరగంట పాటు పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గుతుందని వెల్లడి
- వెంట్రుక కుదుళ్లను ప్రేరేపించి బట్టతలను అరికడుతుందని వివరణ
కంపెనీ ప్రకటన ప్రకారం, రోజూ అర్ధగంట దీన్ని తలకు పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు లేని చోట మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి. ఈ పరికరంతో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవని కూడా సంస్థ హామీ ఇచ్చింది. దీని ధర రూ. 74,735 అని పేర్కొంది. ఆరు నెలల్లోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంది.