Chiranjeevi: చిరంజీవికి ఆతిథ్యమిచ్చిన గవర్నర్ దంపతులు... ఫొటోలు ఇవిగో!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఎన్డీయే ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చిరంజీవికి తెలంగాణ రాజ్ భవన్ నుంచి ఆహ్వానం అందింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు చిరంజీవిని ఘనంగా సన్మానించారు. 

గవర్నర్ ఆహ్వానంతో చిరంజీవి సతీసమేతంగా రాజ్ భవన్ కు వచ్చారు. అక్కడ ఆయనకు గవర్నర్ తమిళిసై, ఆమె భర్త  డాక్టర్ సౌందరరాజన్ ఆత్మీయ స్వాగతం పలికారు. చిరంజీవికి శాలువా కప్పిన గవర్నర్ తమిళిసై... ఆయన పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"రాజ్ భవన్ లో ఇవాళ నాకు ఆతిథ్యమిచ్చిన గౌరవనీయ తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో మేడమ్ గవర్నర్ తెలిపిన అభినందనలకు ధన్యవాదాలు. మీతోనూ, డాక్టర్ సౌందరరాజన్ తోనూ జరిగిన సమావేశం ఎంతో సంతోషాన్నిచ్చింది" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
Chiranjeevi
Padma Vibhushan
Governor
Tamilisai Soundararajan
Hyderabad
Telangana
Tollywood

More Telugu News