పర్సంటేజీ విధానం.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం
- పర్సంటేజీ విధానంపై కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం
- 15 మందితో కమిటీ వేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం
- రెండు నెలల్లో సమస్య పరిష్కారమవుతుందన్న సి.కల్యాణ్
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానానికి సంబంధించిన అంశంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తుండగా, నిర్మాతలు అందుకు అంగీకరించడం లేదు. వివాదం ముదురుతుండటంతో వాణిజ్య మండలి అధ్యక్షుడు డి.సురేశ్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం థియేటర్ యాజమాన్యాలు, నిర్మాతలు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సంటేజీ విధానంపై కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 15 మందితో కమిటీ వేయాలని నిర్ణయించిన ఫిల్మ్ ఛాంబర్, రెండు నెలల్లో నివేదికను సిద్ధం చేయాలని కమిటీకి సూచించనుంది. కమిటీలో ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు ఎగ్జిబిటర్లు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు.
ఈ అంశంపై నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ, ఈ సమస్య రెండు నెలల్లో పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సినిమాల విడుదలకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు. కమిటీలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఐదుగురు చొప్పున ఉంటారని వెల్లడించారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, మైత్రి రవి, సి.కల్యాణ్, దిల్ రాజు సహా 50 మంది నిర్మాతలు హాజరయ్యారు. ఎగ్జిబిటర్ల తరఫున విజయేందర్ రెడ్డి, శ్రీధర్ వచ్చారు.