Vyuham: 'వ్యూహం' సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి... త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం: వర్మ

RGV says Vyuham movie release issues are cleared
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయ అంశాలతో తెరకెక్కించిన చిత్రం 'వ్యూహం'. 'వ్యూహం' సినిమాపై టీడీపీ అగ్రనేత లోకేశ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు న్యాయ వ్యవస్థను ఆశ్రయించడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడం కూడా వివాదాస్పదమైంది. అయితే కోర్టు సూచనలతో సెన్సార్ బోర్డు మరోసారి 'వ్యూహం' చిత్రాన్ని వీక్షించింది. ఆ చిత్రానికి రెండోసారి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది. 

ఈ నేపథ్యంలో, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. "వ్యూహం సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం" అంటూ ట్వీట్ చేశారు. కాగా, వ్యూహం చిత్రాన్ని ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Vyuham
Ram Gopal Varma
Release
Censor
Andhra Pradesh
Telangana

More Telugu News