జాంబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కలరా.. మానవతా సాయం చేసిన భారత్
- గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు 600 మంది మృతి
- 15 వేలమందికిపైగా బాధితులు
- కలరా మందులు, నీటి శుద్ధి యంత్రాలు, ఓఆర్ఎస్ సాచెట్లు పంపిన భారత్
గతంలో ఎన్నడూ లేనంతగా ఆరోగ్య సంక్షోభంతో అల్లాడుతున్న జాంబియా పరిస్థితిపై భారత్ స్పందించింది. నీటిశుద్ధి యంత్రాలు, కలరా నివారణ ఔషధాలు, డీ హైడ్రేషన్ బారినుంచి కాపాడే ఓఆర్ఎస్ సాచెట్లు వంటి సామగ్రితో కూడిన 3.5 టన్నుల మానవతా సాయం పంపినట్టు ‘బీబీసీ’ కథనం పేర్కొంది.