ఉపాసనను అభినందిస్తూ నాగబాబు ట్వీట్
- అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి నిజమైన లెజెండ్
- ఆయన సేవా కార్యక్రమాలకు అభిమానిని అన్న నాగబాబు
- తాత బాటలోనే నడుస్తున్నందుకు ఉపాసనకు అభినందనలు
లెజెండ్స్ వారంతట వారే ఆవిర్భవించాలి తప్ప తయారు చేయడం సాధ్యం కాదని నాగబాబు అన్నారు. అలాంటి లెజెండ్స్ లలో ప్రతాప్ రెడ్డి ఒకరని, ఆయన సేవా కార్యక్రమాలకు తాను అభిమానినని చెప్పుకొచ్చారు. ఇక, తాతగారి బాటలోనే నడుస్తూ ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతోందంటూ మెగా ఇంటి కోడలు కొణిదెల ఉపాసనను నాగబాబు మెచ్చుకున్నారు. ఈ ట్వీట్ చూసిన ఉపాసన.. థాంక్యూ అంకుల్ అంటూ జవాబిచ్చింది.