Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉపాసనను అభినందిస్తూ నాగబాబు ట్వీట్

Naga babu post on Upasasna konidela goes viral
Advertisement
  • అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి నిజమైన లెజెండ్
  • ఆయన సేవా కార్యక్రమాలకు అభిమానిని అన్న నాగబాబు
  • తాత బాటలోనే నడుస్తున్నందుకు ఉపాసనకు అభినందనలు
Advertisement
అపోలో వైద్య సంస్థల వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి నిజమైన లెజెండ్ అంటూ ప్రముఖ సినీ నిర్మాత కొణిదెల నాగబాబు ట్వీట్ చేశారు. ప్రతాప్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన సేవా కార్యక్రమాలకు తాను అభిమానిని అని నాగబాబు పేర్కొన్నారు. అపోలో వైద్య సంస్థల ద్వారా ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నందుకు ఉపాసనను అభినందించారు.

లెజెండ్స్ వారంతట వారే ఆవిర్భవించాలి తప్ప తయారు చేయడం సాధ్యం కాదని నాగబాబు అన్నారు. అలాంటి లెజెండ్స్ లలో ప్రతాప్ రెడ్డి ఒకరని, ఆయన సేవా కార్యక్రమాలకు తాను అభిమానినని చెప్పుకొచ్చారు. ఇక, తాతగారి బాటలోనే నడుస్తూ ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతోందంటూ మెగా ఇంటి కోడలు కొణిదెల ఉపాసనను నాగబాబు మెచ్చుకున్నారు. ఈ ట్వీట్ చూసిన ఉపాసన.. థాంక్యూ అంకుల్ అంటూ జవాబిచ్చింది.
Advertisement
Advertisement
Nagababu
Upasana
Twitter
Apollo
Prathap Reddy
Birthday

More Telugu News