దేశంలోనే అత్యంత పాప్యులర్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్!
- 27.4 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్లతో యోగి సరికొత్త రికార్డు
- యోగి తరువాతి స్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
- 95.1 మిలియన్ పాలోవర్లతో అగ్రస్థానంలో ప్రధాని మోదీ
- 34.4 మిలియన్ ఫాలోవర్లతో రెండో స్థానంలో నిలిచిన అమిత్ షా
యోగి వ్యక్తిగత అకౌంట్‌తో పాటూ ఆయన వ్యక్తిగత ఆఫీస్ అకౌంట్‌ను కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో అనుసరిస్తున్నారు. కోటి మందికి పైగా ఆఫీస్ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు.
లా అండ్ ఆర్డర్ నిర్వహణలో సీఎం యోగి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరుంది. చట్టాలను ఉల్లంఘించే వారిని ఆయన అస్సలు ఉపేక్షించరని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరహా పాలనకు యోగి మోడల్ అని కూడా నామకరణం చేశాయి. మరోవైపు, రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో చేసిన ఏర్పాట్లపై కూడా సర్వత్రా ప్రశంసలు వచ్చాయి.
ఇక ట్విట్టర్ ఫాలోవర్ల పరంగా ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయనను ఏకంగా 95.1 మిలియన్ మంది అనుసరిస్తున్నారు. 34.4 మిలియన్ ఫాలోవర్లతో హోం మంత్రి అమిత్ షా రెండో స్థానంలో ఉన్నారు.