ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాల్లో గందరగోళం: నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అధికారుల హాజరు
- గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని ఆదేశం
- పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న రేవంత్ రెడ్డి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని అడిగారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ పనులను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరును అందించవచ్చునన్నారు. కొన్ని ప్రాజెక్టులను గ్రీన్ ఛానెల్ ద్వారా వేగంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.