మరో పది రోజుల్లో ‘బ్రహ్మోస్ క్షిపణి’ లాంచర్ ల ఎగుమతి: డీఆర్డీవో
- డిఫెన్స్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
- దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు ఎగుమతులపై దృష్టి
- మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఆర్డీవో చీఫ్ కామత్
గడిచిన ఐదారేళ్లలో రక్షణ శాఖ సమకూర్చుకున్న వివిధ ఉత్పత్తులలో 60 నుంచి 70 శాతం ఉత్పత్తులు డీఆర్డీవో అభివృద్ధి చేసినవేనని డాక్టర్ కామత్ వివరించారు. ముందు ముందు ఇది మరింత పెరుగుతుందని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణులను రష్యాతో కలిసి తయారు చేస్తున్నట్లు వివరించారు. ఈ క్షిపణులను ప్రయోగించేందుకు అవసరమైన లాంచర్ లను డీఆర్డీవో అభివృద్ధి చేస్తోందని తెలిపారు. వీటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, మరో పది రోజుల్లో తొలి కన్ సైన్ మెంట్ పంపించబోతున్నామని వివరించారు. డిఫెన్స్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా భారత్ ను నిలబెడుతున్నట్లు పేర్కొన్నారు.