Nara Lokesh: జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్: నారా లోకేశ్

Jagan Handsup tweets Nara Lokesh
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతులెత్తేశారని... వైసీపీ ప్యాకప్ అవుతుందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'హ్యాపీగా దిగిపోతా.. ఎన్నికల ముందు జగన్ స్వరంలో నిరాశ' పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తను ఆయన షేర్ చేశారు. '56 నెలలుగా అధికారంలో ఉన్నాను, నేను బెటర్ గానే చేశానని అనుకుంటున్నా. ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా' అంటూ జగన్ నిర్వేదాన్ని వ్యక్తం చేసినట్టు ఈ వార్తలో ఉంది. తిరుపతిలో జరుగుతున్న ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని సదరు పత్రిక పేర్కొంది.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
AP Politics

More Telugu News