నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమయ్యారనేది ఇప్పటికీ తెలియకపోవడం అవమానకరం: మమతా బెనర్జీ
- నేతాజీ మరణించిన తేదీ ఇప్పటికీ ప్రజలకు తెలియకపోవడం దేశానికే సిగ్గుచేటు అన్న దీదీ
- బీజేపీ అధికారంలోకి వచ్చి పదేళ్లయినా ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శ
- రాజకీయ కార్యక్రమాలకు సెలవును ప్రకటిస్తున్నారన్న మమతా బెనర్జీ
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని దీదీ ప్రస్తావిస్తూ... ఈ రోజుల్లో రాజకీయ కార్యక్రమాలకు సెలవు ప్రకటిస్తున్నారని, కానీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేతాజీ వంటి వారికి మాత్రం సెలవు లేదని విమర్శించారు. నేతాజీ జయంతి రోజున జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని ఏళ్లుగా పోరాటం చేసినా ఫలితం లేదన్నారు.