కొణతాల రామకృష్ణ జనసేన లోకి రావడం శుభ పరిణామం: పవన్ కల్యాణ్
- జనసేన పార్టీలో చేరుతున్నానంటూ కొణతాల రామకృష్ణ ప్రకటన
- కొణతాలను సాదరంగా స్వాగతిస్తున్నామన్న పవన్ కల్యాణ్
- ఆయన సేవలు పార్టీకి ఉపయోగకరం అని వెల్లడి
కొణతాల క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత ఉన్న నాయకుడు అని వివరించారు. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు, జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కొణతాల రామకృష్ణ సేవలు దోహదపడతాయని పేర్కొన్నారు.