కాంగ్రెస్ లో చేరిన తర్వాత చంద్రబాబును తొలిసారి కలిసిన షర్మిల
- చంద్రబాబు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల
- షర్మిలను సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు దంపతులు
- కుమారుడి పెళ్లికి ఆహ్వానించిన షర్మిల
ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. బీజేపీ కూడా వీరితో చేతులు కలిపే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, షర్మిల మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరిగే అవకాశం ఉందనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడే అవకాశం ఉంది.