నయనతార సినిమాను తొలగించిన నెట్ ఫ్లిక్స్
- వివాదాల్లో కూరుకుపోయిన నయనతార 'అన్నపూర్ణి' చిత్రం
- హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా ఉందంటూ విమర్శలు
- ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసిన నెట్ ఫ్లిక్స్
ఈ చిత్రంలో హిందూ పూజారి కూతురు (నయనతార) గొప్ప చెఫ్ కావాలనుకుంటుంది. ఇందులో భాగంగా ఆమె జాతీయ స్థాయి కుకింగ్ పోటీలో పాల్గొంటుంది. ఈ పోటీలో ఆమె మాంసాహారాన్ని వండుతుంది. ఈ కథాంశం హిందువుల మనోభావాలను గాయపరిచింది. సినిమాపై పలు చోట్ల హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
గత బుధవారం ముంబైలోని నెట్ ఫ్లిక్స్ కార్యాలయం ఎదుట ఆ సంస్థకు వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. నెట్ ఫ్లిక్స్ కు వ్యతిరేకంగా వీరు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ నుంచి 'అన్నపూర్ణి' సినిమా మాయమయింది.