ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వస్తే చేయకుండా ఉంటానా?: వరలక్ష్మి శరత్ కుమార్

Varalakshmi Sharath Kumar Special
  • విలక్షణ నటిగా వరలక్ష్మి శరత్ కుమార్
  • లేడీ విలన్ రోల్స్ లో తనదైన మార్క్ 
  • 'సలార్' నుంచి ఛాన్స్ రాలేదని వెల్లడి 
  • ప్రభాస్ మూవీ నుంచి ఛాన్స్ వస్తే వదులుకోనని వ్యాఖ్య 

వరలక్ష్మి శరత్ కుమార్ .. ఇప్పుడు తెలుగు .. తమిళ భాషల్లో లేడీ విలన్ పాత్రలకు ముందుగా పరిశీలించే పేరు. ఈ రెండు భాషల్లోని ప్రేక్షకులు ఆమె విలనిజాన్నీ .. డైలాగ్ డెలివరీని ఇష్టపడతారు. ఇక కీలకమైన పాత్రలలోను .. ప్రత్యేకమైన పాత్రలలోను ఆమె తన మార్క్ చూపిస్తూ వెళుతోంది. ఆమె నటించిన 'హను మాన్' రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 

ఇటీవల వచ్చిన ప్రభాస్ 'సలార్' సినిమాలో శ్రియా రెడ్డి ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. 'సలార్'పై పగ తీర్చుకోవడానికి ఎదురుచూసే పాత్ర అది. ఆ పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తే బాగుండేదనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. ముందుగా వరలక్ష్మినే అనుకున్నారనీ, అయితే కొన్ని కారణాల వలన ఆమె చేయలేకపోయిందనే టాక్ కూడా వచ్చింది. 

ఈ నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి వరలక్ష్మి స్పందిస్తూ .. ' సలార్' సినిమా కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. నన్ను అడిగినట్టుగా .. నేను చేయలేకపోయినట్టుగా వస్తున్న వార్తలు పుకారు మాత్రమే. అయినా ప్రభాస్ సినిమా నుంచి అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా. అలాంటి అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నాను" అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. 
Advertisement
Varalakshmi Sharath Kumar
Hanu Man
Prabhas
Salaar

More Telugu News