నేను జగన్ కాళ్లు మాత్రమే పట్టుకుంటా.. విమర్శలకు బదులిచ్చిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- ఎవరి కాళ్లు పడితే వారివి పట్టుకోవాల్సిన అవసరం తనకు లేదన్న డిప్యూటీ సీఎం
- జగన్ తనకు ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టే జగన్ కాళ్లు పట్టుకుంటానన్న నారాయణస్వామి
- నమ్మకస్తులకు మాత్రమే టికెట్ ఇవ్వాలని వేడుకోలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పెనుమూరులో ఓ పెద్దాయనకు బీఫారాలు ఇస్తే ఇప్పుడు ఆయన తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్సార్‌పురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో ఆదివారం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నిన్నటి నుంచీ వైరల్ అవుతున్నాయి.