Kesineni Nani: కేశినేని నాని కార్యాలయంలో టీడీపీ జెండాల తొలగింపు!

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీతో కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ తనను వద్దనుకుంటున్నప్పుడు తాను కూడా పార్టీతో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రా కదలిరా సభ నిర్వహించగా, ఈ సభకు కేశినేని దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలో కేశినేని నాని కార్యాలయం వద్ద టీడీపీ జెండాలు తొలగించేశారు. పసుపు జెండాలు లేని కేశినేని నాని ఆఫీసు బోసిపోయినట్టుగా దర్శనమిస్తోంది.
Kesineni Nani
TDP
Flags
Vijayawada

More Telugu News