KTR: ధిక్కరిస్తే కఠిన చర్యలు: పార్టీ నాయకులకు కేటీఆర్ తీవ్ర హెచ్చరిక

KTR warns BRS party leaders
షార్ట్స్‌లో చూడండి
పార్టీ నాయకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్మన్ వసంత సురేశ్, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా నాయకులు గురువారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారి మధ్య జెడ్పీ చైర్ పర్సన్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. 

 ఈ సందర్భంగా జెడ్పీటీసీలు మాట్లాడుతూ... జెడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్‌పై వస్తోన్న అవిశ్వాస తీర్మానం పూర్తి అవాస్తవం అన్నారు. పూర్తి పదవీకాలం ఆమెనే కొనసాగుతారని వారు... కేటీఆర్‌కు చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... పార్టీ ఆదేశాలు ఎవరూ ధిక్కరించకూడదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశనం చేశారు.
Go Back to Shorts
KTR
BRS
Telangana

More Telugu News